Monday, 2 November 2026

ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి

నిజామాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): మాదిగ ఉపకులాలు ఎస్సీల వర్గీకరణ మలిదశ ఉద్యమానికి సిద్దం కావాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు అన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఎస్సీల వర్గీకరణ సాధన కోసం ఎమ్మార్పీఎస్‌ దాని అనుబంధ సంఘాలు తీవ్రస్థాయిలో కృషి చేయాల్సి ఉందన్నారు. అందుకు గ్రామస్థాయి నుంచి పార్టీ, అనుబంధ సంఘాలను పటిష్ట పరచాలన్నారు. ఎస్సీల వర్గీకరణకు తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానించినందుకు సీఎం కేసీఆర్‌, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగ, ఉపకులాల వారికి నెలకు రూ. 2వేల చొప్పున ఆసరా పథకం కింద పింఛన్‌ అందించాలని విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *