Monday, 2 November 2026

14న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈనెల 14న సింగరేణి కంపెనీలో వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని  కార్మికులు కోరారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని సింగరేణిలో వేతనంతో కూడిన సెలవు దినంగా పాటించాలని కంపెనీలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నో ఏళ్లుగా కోరుతోందన్నారు. ఇదిలావుంటే సెలవు  కోరుతూ సింగరేణికి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే సింగరేణి యాజమాన్యం రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి అంటూ ప్రచారం చేయడమే తప్ప గనుల్లో రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హెచ్మెమ్మెస్‌ రీజియన్‌ ఉపాధ్యక్షుడు టి.మణిరాంసింగ్‌ పేర్కొన్నారుగనిని యాంత్రీకరణ పేరుతో అభివృద్ధి చేస్తున్న అధికారులు తగిన రక్షణ సూత్రాలను పాటించడం లేదన్నారు. దీంతో గనిలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. యాజమాన్యం ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం పేరుతో కార్మికుల రక్షణ విషయంలో తగిన విధంగా స్పందించడం లేదన్నారు. ఇప్పటికే శాంతిఖని గనిలో చాలా మంది కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. గాయపడిన కార్మికులకు తగిన వైద్యమందించే అవకాశం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *