Wednesday, 4 November 2026

ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, వసతులను పరిశీలించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి జనవరి 9 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలో కొండమల్లేపల్లి ఎంపీపీ ధూళిపాళ్ల రేఖ శ్రీధర్ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని, వసతులను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం అందించాలని వివరించారు విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్‌ రూమ్‌ను పరిశీలించారు. చిన్నారులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. పట్టిక ప్రకారం రోజు వారీ మెనూను సంబంధింత ఉపాధ్యాయులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు చలికాలం కావున విద్యార్థులకు కావలసిన సదుపాయాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు దగ్గరగా ఉండి పరిశీలించాలని తెలిపారు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాన్ని పెంచాలని, సమయపాలన కచ్చితంగా పాటించాలని విద్యార్థిని విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు, క్రీడలను కూడా ప్రోత్సహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జగన్ నాయక్, మంగ్యా నాయక్,యేకుల సురేష్ కుమార్, ఎం.డి ఖదీర్, సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు