Wednesday, 4 November 2026

ముమ్మరంగ కొనసాగుతున్న మన ఊరు మన బడి పనులు

ముమ్మరంగ కొనసాగుతున్న మన ఊరు మన బడి పనులు….

చిలప్ చేడ్/జనవరి/జనంసాక్షి :- ముమ్మరంగా కొనసాగుతున్న మన ఊరు మనబడి పనులు మండలంలోని అజ్జమర్రి గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో మంజూరైన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైదన్నగారి నరేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో మా పాఠశాల ఎంపికైనందుకు సంతోషంగా ఉందని పాఠశాలకు మన ఊరు మనబడి ద్వారా సుమారు రూ.11.74 లక్షల రూపాయలు మంజూరైనవి అలాగే NREGS ద్వారా పాఠశాలకు రూ.31 లక్షలు మంజూరైనాయని వీటి ద్వారా పాఠశాలకు సంబంధించి పాఠశాలలో బండలు ఎలక్ట్రిషన్ పెయింట్ తో పాటు ప్రహరీ గోడ నిర్మాణం అలాగే పాఠశాలకు సంబంధించిన కిచెన్ రూమ్ లెట్రిన్ బాత్రూంలకు సంబంధించిన పనులు వేగవంతంగా కోనసాగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సైదన్న గారి నరేష్ సర్పంచ్ పరుశురాం రెడ్డి అన్నారు