Friday, 6 November 2026

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెదేపా నిర్ణయాన్ని తప్పుగా అర్థంచేసుకున్నారు

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మాల సామాజిక వర్గ నేతలు తప్పుగా అర్థంచేసుకున్నారని తెదేపా ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రిజర్వేషన్‌ ఫలితాలు అందరికీ అందాలన్నదే అంబేద్కర్‌ ఆశయమని అదే నిర్ణయాన్ని తెదేపా తీసుకుందని ఆయన వివరణ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణను మాల సామాజికి వర్గ నేతలు వ్యతిరేకిస్తే ఆగ్రవర్ణల్ని ప్రశ్నించే హక్కును కోల్పోతామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై తెరాస, కాంగ్రెస్‌, వైకాపాలు వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేసిన మోత్కుపల్లి తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇచ్చి తీరుతామని మరోమారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *