Wednesday, 4 November 2026

ఎస్సీ వర్గీకరణ కు చట్ట బద్ధతి కల్పించాలి – ఎం ఎస్ పి

వర్గీకరణ కు చట్ట బద్ధతి కల్పించాలి – ఎం ఎస్ పి
*మార్చ్ 31 ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి*ఎప్రిల్ 4 హైదరాబాద్, విజయవాడ ముట్టడిపెనుబల్లి, మార్చ్ 27(జనం సాక్షి)ఎస్సి వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయ కమిటి నేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు  మహాజన సోసలిస్ట్ పార్టీ ఎం ఎస్ పి అధ్యర్యంలో జరుగుతున్న పాదయాత్ర పెనుబల్లి మండలం లో కి ప్రవేశిం చింది, ఈ సంధర్భం గామహాజన సోసలిస్ట్ పార్టీ ఎంఎస్పి నియోజకవర్గ ఇంచార్జ్ కొలికపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  ఎస్సి వర్గీకరణ చేస్తానని మాదిగ, మాదిగ ఉప కులాలను మోసం చేస్తూ నమ్మక ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ  వైఖరి ని  నిరసిస్తూ మహాజన సోసలిస్ట్ పార్టీ జాతీయ కమిటీ మహాజన నేత మందకృష్ణ మాదిగ పిలుపులో భాగంగా మర్చ్ 31 ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి, ఎప్రిల్ 4 న రెండు తెలుగు రాష్ట్రాల హైదరాబాద్, విజయవాడ ముట్టడి చేయాలని, తెలంగాణలో  అధికారం కోసం చేస్తున్న బిజెపి ని,  తెలంగాణలో అత్యధికంగా ఉన్న మాదిగలు, ఉపకులాలు, రాజకీయంగా బిజెపి ని సమాధి చేస్తామని, భూస్థాపితం చేస్తామని మాదిగల గూటం దెబ్బ బిజెపికి చూపిస్తామని  బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు,మహాజన సోసలిస్ట్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పాదయాత్ర వేంసూర్ మండలం లొ పాదయాత్ర  ముగించుకొని, పెనుబల్లి మండలంలోఆరవ రోజు సాగిందని అన్నారు.కార్యక్రమంలో  నూనె గాంధీ, జుజ్జారపు పుల్లయ్య, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు,  కలపాల ఏసు, గొల్లమందల ముత్తరావు, మరకలా శ్రీను, కొలికపోగు రామకృష్ణ,  జొన్నలగడ్డ రామకృష్ణ , నల్లగట్ల కోటేశ్వరరావు, శ్రీను,  లక్మాన్, కోట బలరాం ,అశోక్, గొల్లమందల పిరయ్య, డాక్టర్ రవి, చావ్లా పుల్లారావు, కుటుంబరావు, తిరుపతిరావు, మరకలా వెంకటేశ్వరవు ,టోపి కోట ప్రసాద్, మహిళ నాయకురాలు మేరీ స్రవంతి, కుమారి నాగమణి, గొల్లమందల వివేక్, కోటేశ్వరరావు, మరకలా ఆనందరావు ,విరస్వామి, కాకాటి చిన్న కిరణ్ ,సగ్గుర్తి బాలరాజు, జొన్నలగడ్డ వెంకటేశ్వరవు, కొలికపోగు అంజి, తదితరులు పాల్గొన్నారు.