Wednesday, 4 November 2026

విద్యార్థుల సంక్షేమమే ద్యేయం

 :ఎంపీపీ ఎల్లుభాయి :శామీర్ పేట్, జనంసాక్షి : విద్యార్థుల ఆరోగ్య రక్షాణే లక్ష్యంగా ప్రభుత్వం పోషణ పక్వాడ్ అభియాన్ ను ప్రారంభించిందని శామీర్ పేట్ ఎంపీపీ దాసరి ఎల్లుభాయి బాబు అన్నారు. సోమవారం శామీర్ పేట్ ఉన్నత పాఠశాలలోపోషణ పక్వాఅభియాన్ కార్యక్రమం నిర్వహించారు.అంగన్వాడి ‘పోషణ పక్ వాడి అభియాన్” పోటీలు వ్యాసరచన నిర్వచించారు. ఈ సందర్భంగా కౌమరదశ పిల్లలకు చిరు ధాన్యాలు (సిరి ధాన్యాలు) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు . అందరి చేత ప్రతిజ్ఞ చేయించి పిల్లలకు బహుమతులు ప్ర దానం చేశారు. “చిరుధాన్యాల” ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయి , శామీర్ పేట్ సర్పంచ్, బాలమణి , ప్రధానోపాధ్యాయురాలు నిర్మల దేవి. ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మ, ఉపాధ్యాయులు.. విద్యార్థులు, అంగన్ వాడి టీచర్లు భవాణి,నిర్మల, శకుంతల, ఎ.రమదేవి, పావని, తదితరులు పాల్గొన్నారు.
27ఎస్పీటీ -2: ఎంపీపీ, సర్పంచ్, ఉపాధ్యాయులు