ధర్మపురి (జనం సాక్షి)జగిత్యాల ఆర్టీసీ బస్సులో జరిగిన ఇన్సిడెంట్‌పై పోలీసు ఉన్నతాధికారులు రూరల్ ఎస్సైగా ఉన్న అనీల్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేసిన విషయం తెలిసిందే, ఒక హిందూ మహిళ మీద దాడి చేసి, దానికి మతం రంగు పులుపుతు ఆ మహిళ భర్త ఆయన ఎస్ఐ మీద ఎంఐఎం పార్టీ కక్ష సాధింపులకు నిరాశనంగా సోమవారం ఉదయం ధర్మపురిలో బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరిగింది. ఆర్టీసీ బస్సులు జరిగిన సంఘటనలో ఒక వర్గం వారి ఆరోపణలు మాత్రమే పరిగణలోకి తీసుకొని బస్సు డ్రైవర్ కండక్టర్ మరి తోటి ప్రయాణికులను విచారించకుండా ఒక వర్గం వారి ఒత్తిళ్లకు మరియు ఎంఐఎం బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడి చేసిన ఎస్ఐ సస్పెన్షన్ వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, ధర్మపురి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బందుకు పిలుపునివ్వగా స్వచ్ఛందంగా బందుకు సహకరించి ఈనాటి ధర్మపురి బందును విజయవంతం చేసిన వర్తక వాణిజ్య వ్యాపారులు పెట్రోల్ బంకులు హోటల్ మూసి ఉన్నాయి స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్ పాటించారు.




