జనం సాక్షి/ కొల్చారంక్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని యువత క్రీడల వైపు సృష్టి సారించాలని కొల్చారం మండల పరిషత్ అధ్యక్షురాలు మంజుల కాశీనాథ్, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం సీఎం కాఫ్ క్రీడా పోటీలను ఎంపీపీ మంజుల కాశీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గ్రామీణ క్రీడల్లో ఉన్న నైపుణ్యతను గుర్తించేందుకు సీఎం కప్పు 2023 టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటాలని తద్వారా జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ రమేష్, ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఎంఈఓ నీలకంఠం, ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోకని రాజ గౌడ్, పి ఈ టి లు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, పంచాయతీ కార్యదర్శులు అరుంధతి ,నగేష్, రమేష్ నాయక్, , ప్రియా శ్రీనివాస్, ప్రవీణ్ రాజేందర్, యువకులు పాల్గొన్నారు.




