జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బేతి రాములు ను బుధవారం కమాన్ పూర్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోల్లపల్లి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ సర్పంచ్ నీలం సరిత శ్రీనివాస్, సిద్దిపల్లె సర్పంచ్ తాటికొండ శంకర్, గుండారం సర్పంచ్ ఆకుల ఓదెలు, నాగారం సర్పంచ్ ఇట వేణి కొమరమ్మ కొమురయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మ మల్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై ని కలిసిన సర్పంచులు




