Tuesday, 3 November 2026

బిజెపి బీసీ అధ్యక్షుని తోలగించడం బీసీల పట్ల చిన్న చూపే. బీసీ నాయకునికె పార్టీ పగ్గాలు అప్పగించాలి

తాండూరు జులై5(జనంసాక్షి)తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని తొలగించి బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్ రెడ్డి నియమించడంపై జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. బిజెపి జాతీయ నాయకత్వాన్ని తప్పు పట్టారు .బీసీ నాయకుడు అయినటువంటి బండి సంజయ్ నీ బలవంతంగా రాజీనామా చేయించి అగ్ర కులాలకు చెందిన కిషన్ రెడ్డికి తెలంగాణ బిజెపి పార్టీ పగ్గాలు అప్పగించడం పై రాజ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు .గత కొంతకాలంగా బిజెపి బలోపేతం కోసం కృషిచేసిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుని తొలగించడం బీసీలను విస్మరించడమే అన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ నాయకత్వాన్ని కొనసాగించాలన్నారు. లేనిపక్షంలో బడుగు వర్గాలకు చెందిన నాయకులు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ స్వయ బాబురావు నియమించాలనివిజ్ఞప్తి చేశారు.వెంటనే కిషన్ రెడ్డి నీ తొలగించాలన్నారు. బహుజన బిడ్డ బండి సంజయ్ ప్రజాదారణ పెరుగుతుందని కొంతమంది బిసి సామాజిక వర్గ నాయకుని ఎదుగుదల చూడలేక పని కట్టుకొని బీసీ నాయకుని పై నిందలువైపారని అన్నారు.