Thursday, 5 November 2026

ఎస్సై మహేందర్, కానిస్టేబుల్ యంకప్ప వల్ల ప్రాణహాని ఉందని హోం మినిస్టర్ కు ఫిర్యాదు

గద్వాల నడిగడ్డ, మార్చి 15 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహేందర్, శాంతినగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని శాంతినగర్ కి చెందిన ఎస్.కె. జాంగిర్ భాష బుధవారము రాష్ట్ర హోమ్ మినిస్టర్ కు ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ. మహేందర్ గతంలో శాంతినగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించినప్పుడు
2017 సం॥లో వినాయక చవితి సందర్భంగా నా దగ్గర పనచేసే మేనేజర్ చాంద్ బాషా
మద్దూర్ గ్రామ ఉత్సవ కమిటి వారికి అంప్లి వైర్ ఇచ్చినందుకు అప్పటి ఎస్.ఐ. మహేందర్
ఆంప్లి వైర్ నీ తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి నాకు ఫోన్ చేసి నోటికి వచ్చినట్లు, చెప్పరాని, వినరాని బూతుమాటలతో దూశిస్తూ –
నీకు బలిసిందారా అని తిడుతూ స్టేషన్ కి రమ్మని పిలిచారనీ, నేను స్టేషన్ కు వెళ్లగా ఎస్.ఐ. నాకు
ఎటువంటి అవకాశం ఇవ్వకుండ తన బూటుకాలితో, బెల్టుతో ఇష్టమొచ్చి నట్లుగా కొట్టగా నాకు బాగా గాయాలయ్యాయనీ,నేను ఎటువంటి తప్పు చేయకపోయిన నన్ను అకారణంగా కొట్టినందుకు
జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు అలంపూర్ కేసు నం. (C.C.No. 396 of 2017)
ఈ కోర్టు పరిధిలో పెండింగులో వున్నదనీ, ఈ విషయమై ఎస్ ఐ మహేందర్ తన మనుషులతో,తనకు అనుకూలంగా వున్న న్యాయవాదుల ద్వారా కేసును వాపాను తీసుకోవాలని బెదిరిస్తున్నాడనీ, ఈ
విషయమై ఇప్పటికే తమరి దృష్టికి గతంలో తీసుకొచ్చానాని, కానీ అతనిపై ఎటువంటి చర్య తీసుకోలేదనీ,
మహేందర్ పై క్రిమినల్ కేసు ఉన్నందున అతనిని మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంనకు అటాచ్ చేశారనీ, అయినా గాని తన పలుకుబడితో పైరవిచేసి, తనపై క్రిమినల్ కేసువున్న కోర్టు పరిధికి ఎస్.ఐ.గా రావడం జరిగిందనీ, తన పలుకుబడితో నన్ను బెదిరించి కేసు
వాపాసు తీసుకోవాలని అంటున్నారనీ,ప్రస్తుతం మళ్లీ అతనిని మహబూబ్ నగర్ ఎస్.పి. కార్యాలయము నుండి అలంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.గా వచ్చారని,అతను విధుల్లో చేరిన వెంటనే మళ్లీ నా దగ్గరికి తన మనిషి శాంతినగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకప్ప ని నా దగ్గరకు పంపించి కేసు వాపాసు తీసుకోవాలని, గత నెల 23 న అందాజ ఉదయం అందాజ 9:30 ని॥ల సమయంలో వచ్చి నేను గత 10 సంవత్సరముల నుండి శాంతినగర్ పోలిస్
స్టేషన్ లో పని చేస్తున్నానాని, రిటైర్డ్ అయ్యే వరకు ఇక్కడే వుంటానని నీవు ఏమి చేయలేవని, కేసు వాపాసు
తీసుకోకపోతే నీ అంతు చూస్తామని బెదిరించినారనీ,నేను పైన తెలిపిన క్రిమినల్ కేసులో అలంపూర్ కోర్టుకు
వాయిదా నిమిత్తం వెళ్తుంటానాని,వారి బెదిరింపులను బట్టి నాకు వారి నుండి ప్రాణహాని వున్నదనీ, ఎస్.ఐ. మహేందర్ ని విధుల నుండి సస్పెండ్ చేస్తూ
అలంపూర్ నుండి పంపించి నాకు ప్రాణరక్షణ కల్పించగలరని, నాకు ఏమి జరిగిన ఎస్.ఐ. మహేందర్ ది, కానిస్టేబుల్ వెంకప్ప దే బాధ్యత అని జహంగీర్ భాష హోమ్ మినిస్టర్ కి మొర పెట్టుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర హోం మినిస్టర్ మహమ్మద్ అలీ ఎస్సై మహేందర్, కానిస్టేబుల్ యంకప్ప పై శాఖా పరమైన విచారణ జరుపుతామని హోం మినిస్టర్ హామీ ఇచ్చినట్లు జహంగీర్ భాష తెలిపారు.