జనం సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ మంథని మండల రైతు సమితి మాజీ కన్వీనర్ మాజి ఎంపీటీసీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ..కాంగ్రేస్ పార్టీ పేదలకు న్యాయం చేస్తుందని, ప్రత్యేకంగా బడుగు వర్గాల వారికి బలహీనవర్గాల వారికి మైనారిటీలకు సంబంధించిన అంశాలకు వస్తే న్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఉకదంపుడు ఉపన్యాసాలతో ,తప్పుడు ప్రచారాలతో, కొన్ని విష పత్రికల ద్వారా చేసే ప్రచారాన్ని అసలే పట్టించుకోవద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాలు ఎందుకు పనిచేస్తే లేరని అంటున్నారని, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రజలకు పనిచేసే కార్యక్రమం చేయాలి కనీస ధర్మం అని హితవు పలికారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేద్దాం అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ




