ఏఐటియుసి కేంద్ర కార్యదర్శిగా అక్బర్ అలీ
ఘనంగా సన్మానించిన ఏఐటీయూసీ యూనియన్ నాయకులు
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) :
ఆగష్టు 25,26,27వ తేదీలలో గోదావరిఖనిలో జరిగిన ఏఐటీయూసీ 16వ కేంద్ర మహాసభలలో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన, మంచిర్యాల ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు యం.డి అక్బర్ అలీ ని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి గా ఎన్నుకున్నారు. ఈ క్రమం లో అక్బర్ అలీని కేంద్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా అభినందించాల్సిన విషయం అని రామకృష్ణపూర్ ఏఐటీయూసీ సోషల్ మీడియా ఇంచార్జ్ గోవిందుల రమేష్ తెలిపారు.
ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ అక్బర్ అలీ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే నిస్వార్ధ మనిషి అని, వారు కార్మికులకు చేసిన సేవలనుగుర్తుచేశారు.
ఏఐటీయూసీ యూనియన్ లో ఉంటూ యూనియన్ బలోపేతం కొరకు అహర్నిశలు కార్మికులకు సేవలు చేసిన అక్బర్ అలీని
పై స్థాయినాయకత్వం గుర్తించి కేంద్ర కార్యదర్శిగాఎన్నుకున్నందుకు
ఏఐటీయూసీ కేంద్ర నాయకత్వం వారికి కృతజ్ఞతలు. తెలియజేసారు.
అనంతరం కేంద్ర కార్యదర్శి గా ఎన్నుకోబడ్డ అక్బర్ అలీని రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ బ్రాంచ్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్ కె పి ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఏ. ఆంజనేయులు, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య,కేంద్ర కౌన్సిల్ సభ్యులు సిద్ధం బాపు, ఆర్ కె ఓసిపి ఫిట్ సెక్రటరీ సంపత్ కుమార్, ఆర్కి1ఏ ఇంచార్జ్ ఫిట్ సెక్రటరీ గోత్త గిరి ప్రసాద్, సల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.