ఏఐటీయూసీ నూతన అధ్యక్షునిగా తెప్ప వెంకన్న
దంతాలపల్లి నవంబర్ 7 జనం సాక్షి
ఏఐటీయూసీ దంతాలపల్లి మండల కమిటీ అధ్యక్షుడిగా మండలంలోని బొడ్లాడ గ్రామానికి చెందిన తెప్ప వెంకన్నను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో నిర్వహించిన మండల ప్రథమ మహాసభలో 11 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు కమిటీ వివరాలు తెలుపుతూ ప్రధాన కార్యదర్శిగా సోమారపు కృష్ణ కోశాధికారిగా బొడ్లాడ గ్రామానికి చెందిన శంకర బోయిన అశోక్ , ఉపాధ్యక్షులుగా కొమ్ము మురళి, సహాయ కార్యదర్శిగా శంకరబోయిన వీరన్న తదితరులను ఎంపిక చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 16న తొర్రూర్ లో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.




