Wednesday, 4 November 2026

విద్యార్థినిలకు టి.డి వ్యాక్సిన్

విద్యార్థినిలకు టి.డి వ్యాక్సిన్

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (07): మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థినిలకు మండల వైద్యాధికారి మంజుల ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది టైటనస్, దీప్తిరియా నివారణ (టి.డి) వ్యాక్సిన్ వేశారు ఈ సందర్భంగా డాక్టర్ మంజుల మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 10 నుండి 16 సంవత్సరాల విద్యార్థులకు ఈనెల 7 నుండి 19 వరకు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. మొత్తం 69 ప్రభుత్వ కామ ప్రైవేట్ పాఠశాలలో 127 మంది విద్యార్థులకు టిడిపి వ్యాక్సిన్ వేనున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి సురేష్ కుమార్, సూపర్వైజర్ సుచిత్ర, కౌసల్య, వైద్య సిబ్బంది వెంకటమ్మ, బాలకిష్ణమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశాలు, అంగన్ వాడి లు తదితరులు పాల్గొన్నారు