Monday, 2 November 2026

ఏకకాలంలో రైతులకు రుణమాఫీని చెల్లించాలి మాజీ మంత్రి గీతారెడ్డి

ఏకకాలంలో రైతులకు రుణమాఫీని చెల్లించాలి
మాజీ మంత్రి గీతారెడ్డి
జహీరాబాద్ నవంబర్ 30 (జనంసాక్షి): తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యల మీద జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ధర్నా, నిరసన నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్డీవో కి మెమరాండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల నుండి కె.సి.ఆర్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూపుతుందని, అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.