కొండమల్లేపల్లి జనవరి 21 (జనంసాక్షి) న్యూస్ :
దేవరకొండ నియోజకవర్గం లోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఎవరికి తెలియ పర్చకుండా, సమాచారం ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిద్ధాంతాలను, క్రమశిక్షణ లను పాటించకుండా ఏకపక్షంగా కమిటిలు వెయ్యడం సరైంది కాదని టిపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్ అన్నారు ఏకపక్షంగా వేసిన కమిటీలను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఇదే రకంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కి తీరని నష్టం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ కమిటీ లు అందరి నిర్ణయం ప్రకారమే వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ లో కార్యకర్తలే నాయకులని అన్నారు.ఇప్పటికైన అన్ని కమిటీ లను రద్దు చేసి అందరిని నిర్ణయాల ప్రకారమే కొత్త కమిటిలు వెయ్యాలని అన్నారు రానున్నది సాధారణ ఎన్నికలు అని ఈ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విస్తృతంగా పాల్గొంటున్నారని ఏఐసిసి అధిష్టానం మేరకు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుల ఆమోదంతో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్నారని ఇటువంటి క్లిష్ట సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ కలిసి మండలాలలో ప్రజలతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో మంచి పట్టున్న ఎలాంటి ప్రలోభాలకు లొంగని బలమైన నాయకులను మండల పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసే నాయకులను కార్యకర్తలను కాపాడుకోవాలని అన్నారు దేవరకొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి స్పందన ఉందని, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజలు విసుగు చెందారని ఇలాంటి సమయంలో అన్ని నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు ఎప్పుడు ప్రజలతో ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ధైర్యమున్న నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు దేవరకొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే దేవరకొండ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విజయం ఖాయమని కేతావత్ బిల్యా నాయక్ తెలిపారు కార్యక్రమంలో యవజన కాంగ్రెస్ నాయకులు కున్రెడ్డి రాజశేఖరరెడ్డి, జేబీఎం జిల్లా అధ్యక్షుడు మద్ది మడుగు నెల్సన్, కిరణ్ నాయక్, హరి నాయక్, జైపాల్ నాయక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు
ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీలు వెంటనే రద్దు చేయాలి కేతావత్ భీల్యా నాయక్




