హైదరాబాద్: నగర శివార్లలోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్పందన అదృశ్యమయ్యారు. స్పందన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త వేధింపుల వల్లనే తమ కూతురు అదృశ్యమైందని తల్లిదండ్రులు అంటున్నారు. స్పందన అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




