రైతుల అవసరాలే అవకావంగా మోసాలు
ఏటా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు
కఠిన చర్యలతోనే అడ్డుకట్టకు సాధ్యం
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): దాడులు చేస్తున్నా, కేసుఉల పెడుతున్నా కొందరు కేటుగాల్లునిరంతరం
మోసం చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల పట్టుబడ్డ నకిలీ విత్తనాల వ్యవహారం చూస్తుంటే ఎంతగా వారు వేళ్లూనికుని పోయారో గమనించవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాలతో పాటు ఎపిలో కూడా అడపాదడపా దాడులు చేస్తూనే ఉన్నారు. నకిలీలు బురిడీ కొట్టించి ఎందరో రైతులను మోసం చేసి తమ వ్యాపారాన్ని సజావుగా చేసేసుకున్నారు. రేపటి రోజున అవి మొలకెత్తినా పంట పండకుండా పోయిన తరవాత గాని తామెంతగా నష్టపోయిందీ రైతులు గుర్తించడం లేదు. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న నకిలీ విత్తనాలు చూస్తుంటే వ్యాపారులు ఇప్పటికే తమ పని కానిచ్చారని గమనించవచ్చు. అందుకే నకిలీ విత్తనాలపై సర్కార్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా విక్రేతలదే పైచేయి అవుతోంది. ఈ లోగానే అమ్మకందారులు డబ్బులు చేసుకుని ఉడాయించారు. ఏటా ఈ తంతు జరుగుతూనే ఉంది. అయినా ఏ ఒక్క విక్రేతకు శిక్షపడినా దాఖలాలు లేవు. ఏరువాక మొదలు కాగానే విత్తనాలకు డబ్బులు ఉండవు. బ్యాంకులు దగ్గరకు రానీయవు. అందుకే ప్రైవేట్ అప్పలు వాళ్లను ఆశ్రయించే రైతులు ఎరువుల, పురుగుమందులు, విత్తనాల రూపంలో అప్పులు చేస్తున్నారు. దీంతో ఏటా రైతు సేద్యం జూదంలా మారింది. వస్తే వచ్చినట్లు..పోతే పంటతో పాటు ప్రాణాలు పోతాయి. వీరి ప్రాణలకు విలువ లేదు కనుక పట్టించుకునే నాధుడు కూడా ఉండడం లేదు. పెట్టుబడి కోసం వేలకు వేలు అప్పు చేసి మంచి దిగుబడులు సాధిస్తే ఈ యేడైనా అప్పుల ఊబినుంచి బయటపడదామన్న ఆశలో ఉంటారు. కానీ ఎప్పటిలాగే నకిలీ విత్తనాల మాఫియా రైతులను ముగ్గులోకి దింపి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. పేరున్న కంపెనీల లేబుళ్లతో ప్యాకెట్లు తయారు చేసి.. అందులో నకిలీ విత్తనాలను నింపి రైతులకు అంటగట్టడం వ్యాపారంగా సాగుతోంది. వ్యాపారుల మోసం గురించి తెలియని రైతులు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చిపడుతూనే ఉన్నాయన డానికి పట్టుపబడుతున్న విత్తనాలే నిదర్శనం. గతంలో మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ కేంద్రంగా ఓ ముఠా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్టాల్లోన్రూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వ్యవసాధికారులపైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో ఎక్కువగా గత ఏడాది ఉత్పత్తి చేసిన విత్తనాలను రీ ప్యాకింగ్ చేసి అమ్ముతున్న వైనం బయట పడింది. కాలం చెల్లిన పత్తి విత్తనాలతోపాటు బెండకాయ, టమాట వంటి కూరగాయల విత్తనాలను కూడా రీ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న విషయం పోలీసుల దాడుల్లో బహిర్గతమైంది. నల్లగొండ జిల్లాలోనూ నకిలీ విత్తనాల బెడద తీవ్రంగా ఉంది. ఇలా రైతులు నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయారు. కొన్ని చోట్ల పోలీసులకు దొరకకుండా విడిగా సరఫరా చేసారు. జనగామ జిల్లాలో కొంత మంది వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మడంతోపాటు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. గద్వాల జిల్లాలో విజిలెన్స్ అధికారులు, పోలీసులు, వ్యవసాయ అధికారులు కలిసి ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నుల వరి, కంది, పత్తి నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో దాదాపు రూ.60 లక్షల విలువైన పత్తి విత్తనాలు అమ్మకాన్ని అధికారులు నిలిపివేశారు. ఇలా అనేక జిల్లాల్లో నకిలీ పత్తి, మిర్చి, మొక్కజొన్న విత్తనాల విక్రయాల దందా యథేచ్ఛగా కొనసాగింది. ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేయకపోవడం వల్ల రైతులకు మేలైన విత్తనం ఆసరా కొరవడింది. ప్రభుత్వం నుంచి విత్తన సరఫరా సక్రమంగా లేకపోవటంతో పాటు, ప్రయివేటు కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావటంతో రైతులకు అయోమయ పరిస్థితి ఏర్పడింది.
ఏటా నకిలీ విత్తనాల జోరు




