Tuesday, 3 November 2026

ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

నిజామాబాద్ : నిన్న నిజామాబాద్, నేడు మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నది మహారాష్ట్రకు చెందిన వారేనని ఐజీ నవీన్ చంద్ తెలిపారు. ముగ్గురు దొంగలను అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దొంగలు గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి దొంగతనాలు చేస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న రూ. 43 లక్షలు అపహరించిన విషయం విదితమే. ఇవాళ మెదక్ జిల్లాలోని ఆటోనగర్, కౌడిపల్లి ఎస్‌బీఐ ఏటీఎంలలో చోరీ చేసేందుకు దొంగలు యత్నించి విఫలమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *