కంటోన్మెంట్ జనం సాక్షి మే15 ఏడవ వార్డు జయలక్ష్మి గార్డెన్ లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ కంటోన్మెంట్ ఇంచార్జ్ మరియు మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ఏడవ వార్డు బాగ్యశ్రీ శ్యామ్ కుమార్ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు మనమంతా గులాబీ నీడలో చల్లగా ఉన్నామంటే దానికి కారణం రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పడ్డ శ్రమ అని చెప్పక తప్పదు.తెలంగాణలో ఆకుపచ్చ చరిత్ర రాశారు సీఎం కేసీఆర్ దీనికి ప్రదానం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం,హిస్టరీలు క్రియేట్ చేయడం కేసీఆర్ కు కొత్తకాదు తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగం చేశారు ఓర్పు నేర్పు పట్టుదలకు మారు పేరుకేసీఅర్ వారి నేతృత్వం లో తెలంగాణ రాష్ట్రం సాధించుకోని సుస్థిర అభివృద్ధికి బాటలు వేసుకున్నాం,అదే విధంగా బీఆర్ ఎస్ ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోంది,57 లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వరి సాగు.. దేశంలో అత్యధికంగా వరి సాగు తెలంగాణలోనే కేసీఆర్ పథకం అందని ఇల్లు రాష్ట్రంలో లేదు అంటే అతిశోక్తికాదు, ఈ రోజు మన రాష్ట్రానికే కాదు,ఒకప్పుడు ఎన్నికల నినాదాలు నేడు కళ్ళ ముందు నిజాలుగా మారాయి,అయ్యా మోడీ మాన్ కీ బాత్ కాదు మా కిసాన్ బాత్ వినండి,వంట గ్యాస్,పెట్రోలు అన్నింటి ధరలూ ఆకాశాన్ని తాకాయి.ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థితికి చేరుకున్నాం.
కేంద్రంలోని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రగతి ఢిల్లీలో మెచ్చుకుంటారు,ఇక్కడ తిడతారు.
మోడీ తప్పులను ఎత్తి చూపితే బీజేపీ నాయకులు సహించలేరు,దేశంలో ఎక్కడికిపోయినా అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ కు జేజేలుస్ పలుకుతున్నారు.కేసీఆర్ ద్వారా తెలంగాణ ఖ్యాతి, గౌరవం పెరుగుతోంది. ఏనాటికైనా కేసీఆర్ కు తెలంగాణ మీద ఉండే ప్రేమ, మోడీకి ఉంటుందా ? రాహుల్ గాంధీకి ఉంటుందా కాంగ్రెస్, బీజేపీ లు ఎన్ని ట్రిక్కులు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం.కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం వల్లనే అట్టడుగున ఉన్న తెలంగాణను అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిపాడు.సమాధులు తవ్వాలని ఒక్కడు, భవనాలు తు కూలకిడతానని ఇంకొకడు మాట్లాడుతాడు.అభివృధి చేయాల్సింది పోయి అసందర్భ వ్యాఖ్యలు బీజేపీ వారికి పరిపాటిగా మారింది.బిఆర్ఎస్ పార్టీ వార్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పినట్లు మోడీ గారు మన ప్రియమైన ప్రధాని కాదు ఆయన పిరమైన ప్రధాని అని ఎద్దేవా చేశారు.
నిజాలను ఖచ్చితంగా మాట్లాడాలి, ప్రచారం చేయాలి, లేదంటే అబద్ధాలు రాజ్యం ఎలుతాయని అంబేద్కర్ చెప్పారు.
అనంతరం కార్యక్రమంలో కంటోన్మెంట్ లోని ఉద్యమకారులకు సన్మానలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఛైర్మన్లు గజ్జెల నగేష్, క్రిశాంక్,ఎర్రోళ్ల శ్రీనివాస్, బోయినపల్లి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాగిరి హారిక ఆనందబాబు,బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి,మాజీ బోర్డ్ సభ్యులు ప్రభాకర్,భాగ్యశ్రీ శ్యామ్ కుమార్,నళిని కిరణ్,పాండు యాదవ్, సీనియర్ నేతలు ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్ రావుల సతీష్ , రావుల శ్రీనివాస్ మరియు బిఆర్ఎస్ కార్యకర్తల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




