అలంపూర్ మే15 జనంసాక్షిఅష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహా శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను సోమవారం కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి సీన్ డ్రంతెలంగాణ టూరిజం ఎండి మనోహర్ ,ఈ డి శంకర్ రెడ్డి, దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి పురేందర్ కుమార్ ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికి ఉభయ ఆలయాలు దర్శనాలు చేయించి, ప్రత్యేక పూజాలు చేయించారు.అనంతరం టూరిజం హోటల్ చేరుకొని అక్కడ హరితహారం కింద మొక్కలు నాటారు. ఈసందర్బంగా కేంద్రం పర్యటన కార్యదర్శి మాట్లాడుతూ అలంపూర్ ఆలయాల అభివృద్ధి కొరకు అదేవిధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను పెంపొందించేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాలు చక్కటి ఆలోచనతో ముందుకు వెళుతున్నాయని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర పర్యటక శాఖ నుండి మరింత తోడ్పాటును అందిస్తామని వారు అన్నారు.అదేవిధంగా ఇక్కడి ప్రాసెస్ అన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని కల్పించేందుకు కేంద్ర పర్యాటక శాఖ తమవంతు సహకారాన్ని అందిస్తుందని వారు తెలియజేశారు.




