Tuesday, 3 November 2026

ఏడాదిన్నర పాపపై అత్యాచారం…తండ్రి సరైన శిక్ష

బాటిండా : పంజాబ్‌లోని బాటిండాలో దారుణం జరిగింది. అత్యాచార నిందితుడి చేతులను ఓ వ్యక్తి నరికేశాడు. 2014లో తన 18 నెలల కుమార్తెపై అత్యాచారం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. ఈనేపథ్యంలో బాలిక తండ్రి ప్రతీకార దాడి చేశాడు. కత్తితో నిందితుడి రెండు చేతులు నరికేశాడు. తీవ్ర గాయాలపాలైన నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *