మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

555భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఈ నెల 28 న మరో ప్రయోగానికి సిద్ధం కానుంది. నావిగేషన్‌ పరీక్షల్లో చివరిదైన ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. స్వంత నావిగేషన్‌ వ్యవస్థ కోసం ఇస్రో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. గత నెలలోనే 6వ ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్‌ గా ప్రయోగించింది. ఈ నెల 28 న చివరి ఉపగ్రహా ప్రయోగం సక్సెసైతే భారత్ సొంతంగా నావిగేషన్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది.