Thursday, 5 November 2026

ఏడుగురు  విద్యార్థులకు ఎన్.ఎం.ఎం.ఎస్ స్కాలర్షిప్స్

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, మే 22 (జనం సాక్షి)ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంగషాయపేట్ వరంగల్ నందు 2022 – 23 సంవత్సరానికి గాను ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు  నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ ఎం ఎం ఎస్) కు గాను నిర్వహించబడిన పరీక్షలలో ఈ పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వరంగల్ జిల్లా లోనే అత్యధికంగా ఎంపిక కాబడినారు వారు అఫ్రీన్ బేగం,  బజ్జురి కీర్తన మెతుకు తేజశ్రీ,  బజ్జూరి కీర్తి,  శంకేశి మణికంఠ, బుడిగ లిఖిత్ సాయి మరియు గంధం రాజకుమారులు ఎంపిక కాబడినారు.  ఈ పరీక్షలలో ఎంపిక కాబడిన విద్యార్థులకురూ. 12000 రూపాయలు (పన్నెండు వేల) చొప్పున నాలుగు సంవత్సరాల వరకు అనగా 9, 10 ,   ఇంటర్ ఫస్టియర్ మరియు ఇంటర్ సెకండియర్  పూర్తయ్యే వరకు స్కాలర్షిప్ ప్రభుత్వం చెల్లిస్తుంది.వరంగల్ జిల్లాలో గల అన్ని యజమాన్యాలా పాఠశాలల్లో కన్నా మొదటి స్థానం దక్కించుకున్న ఘనత ఈ పాఠశాలకు దక్కింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  పి నరేంద్ర స్వామి  విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎంఎస్ ఇన్చార్జిగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు  సిహెచ్ కిరణ్ కుమార్ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ మరియు  డి వేణు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తదితరులు పాల్గొన్నారు.