బిచ్కుంద మే 22 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల హజ్గుల్ గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా ఈత కొలనూ కొనసాగుతుంది. గ్రామ సమీపముగా ఉండడంతో గ్రామ యువకులు చుట్టు పక్కల గ్రామాల నుండి నిత్యము ప్రతి రోజు పదుల సంఖ్యలో వేసవి కాలం కావడంతో స్విమ్మింగ్ పూల్ లో సేదదీర్చుచున్నారు. ఈత కొట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి ట్రేనర్ కూడా లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈత కొట్టె సమయంలో ఈత రాని వారికి ప్రాణహాని ఉందని భయపడుతున్నారు. గతంలో అధికారులు అనుమతి తీసుకోవాలని చెప్పినా సదరు యజమాని అనుమతి తీసుకోకుండా బాధ్యత రహితంగా స్విమ్మింగ్ పూల్ నడిపీయడం మంచిది కాదని జనం ఆగ్రహము వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని జనం కోరుతున్నారు.





