బషీరాబాద్ ఫిబ్రవరి 27, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున మహిళా సమక్య భవనం లో ఏపిఎం పద్మారావు ను మాసన్ పల్లి గ్రామ సర్పంచ్ భీమప్ప నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాసనపల్లి గ్రామ సర్పంచ్ భీమప్ప మాట్లాడుతూ జైరామ్ గ్రూపులో 10 మంది సభ్యులు ఉండగా ఇందులో నా లోన్ మొత్తం కడితే మళ్ళీ లోన్ ఇస్తానని చెప్పి,ఇప్పుడు మీ గ్రూపులో ముగ్గురిదీ మొండిబకాయ ఉన్నందున నేను లోను ఇవ్వటానికి రాదని, వారి ముగ్గురు మొండి బకాయిలు కట్టాలని ఏపీఎం పద్మారావు చెపుతున్నారని. నాపై ఒత్తిడి చేస్తున్నారు తప్ప వారు మాత్రం వారిని మొండిబకాయలు వసూలు చేయకుండా మిగతా గ్రూపు సభ్యులు ఇబ్బంది పెడుతున్నారని ఏపీఎం పద్మారావు పై విమర్శించారు. గతంలో నేను శ్రీనిధి లోను కట్టకుంటే నా యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కు అకౌంట్లో వేసుకుంటే డబ్బులు డ్రా చేయకుండా నా అకౌంట్ ను హోల్డ్ లో పెట్టారని ఈ విధంగా నన్ను ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు మాత్రం వారి ముగ్గురిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అదేవిధంగా 2020 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు మా గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో, ఎంత వసూలు చేశారు.అన్ని వివరంగా తెలుపాలని వారికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏపీవో పద్మారావు ఈ సమస్య పైన మాట్లాడుతూ వారిని వేరే గ్రూపులో చేర్పించి లోన్ ఇద్దామన్న వేరే గ్రూపు సభ్యులు వీళ్ళని తీసుకోవడం లేదని, నేను వీరికి లోన్ ఎలా ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిసి సరళ,గ్రామ సంఘ అధ్యక్షులు నాగమ్మ, కార్యదర్శి చంద్రకళ, వివోఏ కవిత పాల్గొన్నారు.
ఏపిఎం అధికారిని నిలదీసిన సర్పంచ్




