బషీరాబాద్ ఫిబ్రవరి 27,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ లో చోరీ ప్రయత్నం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ పట్లోళ్ల విద్యా చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో సబ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న పరమేశ్వర్ శనివారం విధులు ముగించుకొని పోస్ట్ ఆఫీస్ కు తాళాలు వేసి వెళ్ళిపోయాడు. సోమవారం పోస్ట్ ఆఫీస్ కు వచ్చి తాళం తీసి చూడగా తన టేబుల్ పై ఉన్న కౌంటింగ్ మిషన్ ప్రింటర్ కనిపించలేదు దీంతో పోస్ట్ ఆఫీసులోకి వెళ్లి చూడగా వెనక కిటికీల నుండి వచ్చి కౌంటింగ్ మిషన్ దొంగిలించి పోస్ట్ ఆఫీస్ వెనకాల పడేసినట్టు అక్కడ పడి ఉండటానికి గమనించి,ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి ప్రయత్నించినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వెంటనే
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పట్లోళ్ల విద్యా చరణ్ రెడ్డి తెలిపారు
పోస్ట్ ఆఫీస్ లో చోరీ ప్రయత్నం




