Wednesday, 4 November 2026

ఏపీకి 42 శాతం నిధులివ్వడం సంతోషం : చంద్రబాబు

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) ఏపీకి 42 శాతం నిధులివ్వడం సంతోషమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అన్నారు. ఇతర రాష్ట్రాలతోపాటు ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకరించాలని చంద్రబాబు కోరారు. గత ఆర్థికసంఘం, ప్రస్తుత ఆర్థికసంఘం నివేదికల మధ్య వ్యత్యాసాలున్నాయన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. మన రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీకి హామీ ఇచ్చారని, ఆ మొత్తం ఉద్యోగుల జీతాలు, నిర్వహణఖర్చులకే సరిపోతుందని ఆయన చెప్పారు. ఆర్థికసంఘం ప్రత్యేకనిధులివ్వడంలో విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *