Thursday, 5 November 2026

ఏపీలో ప్రారంభమైన ఎమ్మెల్సీ పోలింగ్‌

హైదరాబాద్‌, మార్చి 22 : ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 117 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 21,551 ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. గుంటూరు-కృష్ణాలో 110 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా 18వేల మంది ఓట్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *