Thursday, 5 November 2026

అనంతకు ప్రత్యేక ప్యాకేజీ కోసం ‘పల్లె’ నివాసం ముట్టడి

హైదరాబాద్‌, మార్చి 22 : అనంతపురం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇంటిని వామపక్షాల ఆధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడించారు. జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని నినదించారు. అప్పుటివరకు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *