హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. ఏపీ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ఇతర అంశాల్లో సభ్యుల వద్ద నుంచి వసూలు చేసుకున్న డబ్బులు రూ.13కోట్ల వరకూ దుర్వినియోగం చేశారంటూ హైదరాబాద్ జిల్లా సహకార సంఘం ఉపరిజిస్ట్రార్ హరిణి ఫిర్యాదు నేపధ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పలు పత్రాలు కూలంకషంగా పరిశీలించిన అనంతరం గోపాల్ రెడ్డి సహా మరో 19 మంది పై ఐపీసీ406,409, 402, 180, 120`బి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.సహకార శాఖ అధికారులు సమర్పించిన పలు ధ్రువ పత్రాలను పరిశీలించిన అనంతరం దర్యాప్తును ప్రారంభించనున్నమని సీసీఎస్ పోలీసు వర్గాలు తెలిపారు.




