Tuesday, 3 November 2026

మొఖం చాటేసిన కేసీఆర్‌

6 లోగా లేఖకు సమాధానం చెప్పాలి: చింతా స్వామి
హైదరాబాద్‌: 1969లో గెలుపొందాక తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకుంటే, ఇప్పుడు మాత్రం ఎన్నికలకు ముందే అమ్ముకుంటున్నారని తెరాసనుద్దేశించిఆ పార్టీ ప్రధాన  కార్యదర్శి చింతా స్వామి ఆరోపించారు. పార్టీలో లేడని ఆ పార్టీలో జరుగుతున్న కుహన రాజకీయాలపై కేసీఆర్‌కు లేఖ రాస్తే చింతా స్వామి పార్టీలో లేడని ఆ పార్టీ కార్యాలయం ప్రకటించడం విస్మయానికి గురిచేసిందన్నారు.తన లేఖకు సమాధానం చెప్పలేక కేసీఆర్‌ మొఖం చాటేశారని ఆదివారం సోమాజిగూడా ప్రెస్‌క్లబ్‌లో  విమర్శించారు. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచి ఉద్యమం లోనూ, ఆతర్వాత పార్టీలోనూ తాను చేపట్టిన పదవులు, చేస్తున్న ఉద్యమం పార్టీకి, కేసీఆర్‌కు తెలుసన్నారు. తన లేఖ పై ఈ నెల 6వ తేదిలోపు కేసీఆర్‌ స్పందించాలని, లేని పక్షంలో ఆయన ఇంటి మీద దండోర మోగిస్తామని చింతా స్వామి హెచ్చరించారు. ‘2006’లో లగడ పాటి మీదికి తనను ఉసిగొల్పి, నీవు వెళ్లి ఆయన్ను కౌగిలించుకున్నావు, ఇదేనా తెలంగాణ నీతి అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కడియం శ్రీహరి తెలంగాణ ఉద్యమానికి  ద్రోహం చేస్తున్నారని , అలాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవద్దన్నందున ఉద్యమకారుడికి ఇబ్బందుల కలిగిస్తారా అన్నారు. ఆయన కడియం కాదు కడియాల శ్రీహరి అని వ్యాఖ్యానించింన విషయం గుర్తులేదా , శ్రీహరీ తమరు కడియాలనా , కడియామా తేల్చు కోవాలని సూచించారు. తెరాసలో చేరుతున్న ఎంపీ, ఎమ్మెల్యేలు కుటుంబ ప్యాకేజీలు మాట్లడుకుని వచ్చే వారే కాని ఉద్యమం కోసం కాదన్నారు. ఇప్పటి దాక పార్టీలో చేర్చుకున్న వారు. చాలు నిధులు అవసరమైతే అడుక్కోవాలే తప్ప దిగజారుడు విధానం వద్దన్నారు. సమావేశంలో పాలడుగు సాలయ్య, చింత రాములు, డప్పు రామ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *