Wednesday, 4 November 2026

ఏబీఎన్‌ ప్రసారాల నిలిపివేత సరికాదు: కేంద్రమంత్రి జవదేకర్‌

హైదరాబాద్‌: ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాల నిలిపివేత సరికాదని కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేవకర్‌ అన్నారు. ప్రసారాల నిలిపివేతపై అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడామన్నారు. తెలంగాణలో విద్యుత్‌ సమస్య తీర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. నల్లగొండ జిల్లాలో ఏర్పాటు కానున్న నాలుగువేల మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌కు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడమే తరువాయన్నారు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *