సికింద్రాబాద్ లో ఎక్సైజ్ శాఖ అధికారులు పలు వైన్ షాపుల మీద దాడులు చేశారు. కల్తీ మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో రైడ్ చేసిన అధికారులు.. పలు షాపుల నుంచి 56 బ్లెండర్ స్పైడ్ బాటిళ్లు సహా, ఇతర బ్రాండ్ షాంపిల్స్ను పరీక్షల నిమిత్తం పంపించారు. నాణ్యత పరీక్షల్లో కల్తీ ఉందని తేలితే వైన్స్ షాపులను సీజ్ చేస్తామని చెప్పారు.




