ఏసీబీ వలలో మత్స్యశాఖ అధికారి
వైరా డిసెంబర్ 24న జనం సాక్షి
ఫోన్ పేద్వారారూ.50,000 /-లంచం తీసుకున్న కేసులో వైరా మత్స్యశాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న ఫిషరీస్ అసిస్టెంట్ మార్కాపురం మురళిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి శనివారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు వివరాల్లోకెళ్తే జులై 1 నుంచి అధికారులు కొన్ని కారణాలవల్ల వైరా రిజర్వాయర్ లో చేపల వేట నిలిపివేశారు అయితే ఈ సమయంలో చేపల వేట కొనసాగించేందుకు గాను లక్ష రూపాయలు ఇవ్వాలని తన అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని మురళీ చెప్పడంతో తాను జూలై 21న రూ.50,000 /-ఫోన్ పే ద్వారా చెల్లించినట్లు మత్స్య సంఘం అధ్యక్షుడు రహీం తెలిపారు. అయినా వేటక అనుమతి ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ గారికి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఏసీబీ డిఎస్పి సూర్యనారాయణ ఆధ్వర్యంలో సిఐలు శ్రీనివాస్ ,బాలకృష్ణ సిబ్బంది శుక్రవారం వైరా జిల్లా మత్స్యశాఖ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు అధికారులు మురళిని అదుపులోకి తీసుకున్నారు శనివారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో డిమాండ్ చేశారు .వైరా మత్స్యశాఖ అధికారి బుజ్జిబాబు పాత్ర పై కూడా విచారణ నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఏసీబీ వలలో మత్స్యశాఖ అధికారి




