Wednesday, 4 November 2026

ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా చాంద్ పాషా.

బెల్లంపల్లి, మార్చ్ 28, (జనంసాక్షి )
ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎండీ చాంద్ పాషా ఎన్నికయ్యారు. ఐఎఫ్టియు 9వ రాష్ట్ర మహాసభలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 25, 26, 27 తేదీలలో జరిగాయి. 25న భారీ కార్మిక ప్రదర్శన, 26, 27 తేదీలలో శ్రీనివాస గార్డెన్ జరిగిన మహాసభల్లో కార్మిక, రైతాంగ పోరాటల్లో 30 సంవత్సరాల అనుభవం కలిగి, అందరిలో సౌమ్యుడు అని పేరున్న చాంద్ పాషాను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈయన ఎన్నికపై సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్, ప్రగతిశీల కస్తూర్బా గాంధీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం, సులబ్ వర్కర్స్ యూనియన్, సోషల్ వెల్ఫేర్ వర్కర్స్ యూనియన్, మోటార్ వర్కర్స్ యూనియన్, ప్రగతిశీల రైల్వే వర్కర్స్ యూనియన్, ప్రగతిశీల యువజన సంఘం తదితర ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా చాంద్ పాషా మాట్లాడుతూ తనపై పెట్టిన బాధ్యతను ఎటువంటి శషబిషలు లేకుండా, ఎటువంటి రాజీ పడకుండా, కార్మిక వర్గం తనపై పెట్టిన బాధ్యతలను నిర్వర్తిస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గంతో కలిసి పోరాటాలు చేస్తానని అన్నారు.