Friday, 6 November 2026

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పానుగల్ నవంబర్ 14జనంసాక్షి
సోమవారం రోజు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను బుసిరెడ్డిపల్లి,వెంగళాయపల్లి, కదిరేపాడు గ్రామాలలో సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, జడ్పిటిసి లక్ష్మీ చంద్రశేఖర్ నాయక్, ఏపీఎం సక్రు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, వరి ధాన్యాన్ని నేరుగా వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి, మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కదిరేపాడు ఎంపీటీసీ వీరపాగా నాగమ్మ,సర్పంచ్ లక్ష్మయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వీరపాగ రామకృష్ణ, విబికేలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు