బిజెపి అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ శాస్త్రీయ పోరాటాలను బలోపితం చేయాలి
–ఆహ్వాన సంఘం ముద్రించిన గోడ పత్రికల ఆవిష్కరణ
టేకులపల్లి,నవంబర్ 14( జనం సాక్షి ): డిసెంబర్ 7,8 తేదీలలో హైదరాబాదులో జరిగే పి డి యస్ యూ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపాటి పృథ్వీ విద్యార్థులను కోరారు. సోమవారం ఇల్లందులో పి డి యస్ యూ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ముద్రించిన గోడపత్రికలను టేకులపల్లి పోస్ట్ మెట్రిక్ వసతి గృహం విద్యార్థులతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రాభివృద్ధికి దోహదపడాల్సిన విద్యారంగం పట్ల పాలకులు నిర్లక్ష్యం, ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించడం మూలంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చెందుతూ బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య లేకుండా దూరమవుతుందని వారు అన్నారు. పాలక ప్రభుత్వాలు అందరికీ విద్యా అనే లక్ష్యంతో గణనీయంగా పాఠశాల, వసతి గృహాల సంఖ్య మాత్రమే పెంచుతున్నారు తప్ప వాటికి సౌకర్యాలు కల్పించే విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ విద్యను మింగేందుకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యాధిపతులతో కుమ్మక్కై ఎటువంటి షరతులు లేకుండా ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలకు విపరీతమైన పర్మిషన్ లు ఇస్తూ ప్రభుత్వ విద్యా పతనానికి ప్రభుత్వమే ఒడిగడుతుందని వారు అన్నారు. అంతేకాకుండా బిజెపి ప్రభుత్వం 2020లో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ విద్యాసంస్థలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా విద్యారంగంపై పూర్తి అధికారాలు వారికి అప్పజెప్పే కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తున్న క్రమంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు బలమైన పోరాటాలు నిర్వహించాల్సిన �




