నాయకుడు హన్మంత్ రావు పాటిల్ డిమాండ్ ఐకేపి విఓఏ సర్ప్ ఉద్యోగులుగా గుర్తించి.. ఉద్యోగ భద్రత కల్పించాలని కాంగ్రెస్ నాయకుడు సీనియర్ నాయకుడు హన్మంత్ రావు పాటిల్ డిమాండ్
ఝరాసంగం మండల కేంద్రంలో గత 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఐకెపి విఓఏ లను సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంగ్రెస్ర్ పార్టీ ఝరా సంగం మండల అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ ఐకెపి వివోఏ లకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐకెపి వివోఏ లకు కనీస వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబడ్డారు. ఐకెపి వివో ఏ లను సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి వారికి భద్రత కల్పించాలి, కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. విఓఏ ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ముందుంటుందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం విఓఏ ల సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వివో ఏ లకు కనీస వేతనాలు అందించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వి ఓఏలు , తదితరులు పాల్గొన్నారు.




