కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 1 :-. కార్మికుల శ్రమ దోపిడి విముక్తి కోసం ఎందరో త్యాగదనులు ప్రాణాలను ఎదురోడ్డి రక్తం చిందించి పోరాడిన విజయ గీతిక శ్రమజీవుల సంఘటిత శక్తికి ప్రతీక మేడే అని ఐ ఎఫ్ టి యు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ బాబు అన్నారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి మొదలుకొని మీనాక్షి హాస్పిటల్ వరకు జవహార్ నగర్ ఐ ఎఫ్ టి యు నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు కార్మికులందరిలో ఐక్యతను మేల్కొలిపె దిశగా మేడే వర్థిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివ బాబు జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని జవహర్ నగర్ ఐ ఎఫ్ టి యు నాయకులు ఎన్ రాములు చేతుల మీదుగా ఆవిష్కరించి ఉద్యమాభివందనాలు సమర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కళాకారుల బృందం ఆలపించిన ఉద్యమ స్ఫూర్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ టి యు నాయకులు బి రాములు ఎన్ ప్రేమ్ కుమార్ ఓ ప్రకాష్ కె పవన్ వెంకటయ్య కార్మికులు అరుణోదయ వేణి పి ఓ డబ్ల్యు జయసుధ తదితరులు పాల్గొన్నారు




