ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 29 మండల పరిధిలోని బీచుపల్లి గ్రామంలో మహిళా సమాఖ్య (ఐకేపీ) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ నరసమ్మ హాజరై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు కొనుగోలు కేంద్రం దగ్గర ఉండి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ఎక్కువ తేమ లేకుండా వరి ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఎపిఎం శోభారాణి, వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, రైతులు గొల్ల నరసింహులు, సుధాకర్ రెడ్డి, మహిళా సమైక్య సభ్యులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




