అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలల్లోకి తీసుకువెళ్లాలి
మోత్కూరు నవంబర్ 29 జనంసాక్షి : సీఎం కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలల్లోకి తీసుకువెళ్లాలని మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్,మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి లు కోరారు. తుంగతుర్తి శాసన సభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మండలంలోని దాచారం,సదర్శాపురం,పాటిమట్ల గ్రామాలలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుబంధు,కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కెసిఆర్ కిట్టు, దళిత బంధు, ప్రతి ఇంటికినల్ల నీళ్లు రైతుబంధు,రైతు బీమా,ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేయడం జరిగిందని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ డైరెక్టర్ ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మీనరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు కొండ సోమల్లు, గ్రామ శాఖ అధ్యక్షులు కడమంచి వస్తాద్, దొండ నర్సయ్య, బండి రాజు, సర్పంచ్ లు అండం రజిత రాజిరెడ్డి,వర్రె కవిత శ్రీనివాస్,దండబోయిన మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి గిరగాని శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షులు గనగాని రాజేష్,కార్మిక విభాగం అధ్యక్షులు తీగల చంద్రయ్య, టిఆర్ఎస్ నాయకులు రచ్చ సంజీవరెడ్డి,గనగాని యాదగిరి, దొండ పవన్, కురుమేటి అంజయ్య, బండ సంజీవరెడ్డి, దొండ సత్తయ్య, దొండ కోటిలింగం,కొమురయ్య, లగ్గాని యాదయ్య,మంగ పండ్ల మల్లయ్య,కప్ప లింగయ్య, జినుకల కిష్టయ్య, కడమంచి శ్రీను, వీరయ్య టిఆర్ఎస్ మూడు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




