ఐక్యతతో అభివృద్ధిసాధ్యం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం* వి యం అజయ్
* అలంపూర్ జనంసాక్షి (నవంబర్ 23)* అలంపూర్ అభివృద్ధికి అందరూ కలిసి రావాలి అని వి యం అజయ్ అన్నారు.శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ఆదేశాల మేరకు అలంపూర్ పట్టణంలో ఉన్న పార్టీ ఆఫీస్ నందు అలంపూర్ మున్సిపాల్టీ లోని పార్టీ ముఖ్య నాయకులు మరియు ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే తనయుడు అజయ్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు అబ్రహం తనయుడు డా.వి.యం.అజయ్ మాట్లాడుతూ మన ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మరియు ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ కృషితో అలంపూర్ మున్సిపాల్టీ అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది అన్నారు.అలాగే రాబోయే కాలంలో మరింత అభివృద్ధిలో పోటీపడి అలంపూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివ్రుది చేసుకుందామని అన్నారు. మన గౌరవ సీఎం కెసిఆర్ పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్తున్నారని తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అందరూ ఒకే ఏకతాటి పైకి వచ్చి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరోసారి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరియు అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం నాయకత్వాన్ని గెలిపించే దిశగా అందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని వారిని కోరారు.
ఈ సమావేశంలో వివిధ శాఖల మున్సిపాలిటీ చైర్మన్ మనోరమ వైస్ చైర్మన్లు మరియు వివిధ వార్డుల కౌన్సిలర్లు మరియు కో ఆప్షన్ మెంబర్లు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఐక్యతతో అభివృద్ధిసాధ్యం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య




