హైదరాబాద్ సిటీ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో మిగిలిపోయిన సీట్లకు అడ్మిషన్ల కోసం రెండో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఓల్డ్‌సిటీ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ హమీద్‌ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఆసక్తి గల విద్యార్థులు ఆయా ఐటీఐ కళాశాలల్లో ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 27న ఓల్డ్‌సిటీ ఐటీఐ కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుందన్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి కాల్ లెటర్లు పంపడం లేదన్నారు.




