Wednesday, 4 November 2026

ఐటీడీఏ కార్యాలయ ముట్టడిని విజయవతం చేయండి.తుడుందెబ్బ

 

 

 

 

 

 

గుడిహత్నూర్: ఫిబ్రవరి( 13 జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో వాల్మీకి బోయ, ఖాయితీ లంబాడతో పాటు 11 కులాలను షెడ్యూల్ తెగల ఎస్టీ జాబితాలో చేరుస్తూ శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నిరసిస్తూ సోమవారం మండల కేంద్రంలో ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ అధ్యక్ష ,ప్రదాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న 9 తెగల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదని పైగా మరో 11 కులాలను ఎస్టీ జాబితా చేర్చడం వల్ల ఎస్టీ జాబితాలో ఉన్న తొమ్మిది తెగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనిఅన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిది ఏండ్లు గడిచినప్పటికి ఆదివాసులకు సరైనవిద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆనేక సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. అసలైన గిరిజన తెగలకు దక్కాల్సిన హక్కులను లంబాడీలు దోచుకుంటుంటే వారిని ఎస్టీ జాబితాలో నుండి తోలగించక లంబాడీల ఓటు బ్యాంకు కోసమే వారిని తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటుందన్నారు. సభ తీర్మానాన్ని వెనక్కి తీసుకోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయని యెడల గిరిజనగూడ