Wednesday, 4 November 2026

బడ్జెట్లో బీసీలకు మొండిచేయి..

 

 

 

 

 

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు రాపేల్లి రమేష్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 13. (జనంసాక్షి).కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం చేశాయని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు రాపెల్లి రమేష్ అన్నారు. సోమవారం అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో దేశంలో 66% ఉన్న బీసీలకు కేవలం రెండు శాతం నిధులు కేటాయించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని తెలిపారు. బీసీల ఓట్లతో అధికారులకు వచ్చి బీసీలకు మొండి చేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మిట్టపల్లి రాజమల్లు తదితరులు పాల్గొన్నారు