జిన్నారం మే 16(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని మాధవానికుంటలో గుర్తుతెలియని శవం మంగళవారం మధ్యాహ్నం స్థానికులు గుర్తించారు! అయితే స్థానికులు బొల్లారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదానికుంట లో 35 సంవత్సరాల గుర్తు తెలియని శవం నీటిలో తేలియాడుతున్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు శవాన్ని బయటకు తీశారు. మృతిని శరీరంపై తెల్లరంగు హౌస్ బనియన్, నల్లపు ప్యాంటు, మెడలో ఎర్రటి రంగు తాడు, ఎడమ కాలికి నలుపు రంగు దారం ధరించి ఉన్నాడని ఎవరికైనా మృతుని వివరాలు తెలిస్తే ఈ8712656629 మొబైల్ నెంబర్ కు సంప్రదించాలని ఐడిఏ బొల్లారం పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు!




