Thursday, 5 November 2026

కనకదుర్గ ఆలయానికి గ్రానైట్ అందజేసిన చిలువేరు సమ్మిగౌడ్

 

 

 

 

 

 

 

 

 

కేసముద్రం/మే 16 జనం సాక్షి/ మండలం లోని బిచ్య నాయక్ తండా లో కనకదుర్గ ఆలయాన్ని నిర్మిస్తుండగా ఆ ఆలయానికి దాతగా వ్యవహరించాలని భారాస నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ను సర్పంచ్,గ్రామ వార్డు సభ్యులు,గ్రామస్థులందరు కలిసి కోరగా స్పందించిన సమ్మిగౌడ్ కనకదుర్గ ఆలయ నిర్మాణానికి,అలంకరణకు కావాల్సిన గ్రానైట్ అందజేశారు.గ్రానైట్ అందించినందుకు గాను బిచ్య నాయక్ తండా గ్రామస్థులు సమ్మిగౌడ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు మంగమ్మ-రాములు,భారాస గ్రామ పార్టీ అధ్యక్షులు వాంకుడొత్ రవినాయక్,వార్డ్ సభ్యులు గుగులోత్ రవి, గుగులోత్ శివ,అంగోత్ శివ,వాంకుడొత్ బావ్ సింగ్,ఎమ్ ఆర్ పి ఎస్ కంటిపూడి అరుణ్ కుమార్,యుగేందర్ లు పాల్గొన్నారు.